Welcome to Bharatha Chaitanya Yuvajana Party

భారత చైతన్య యువజన పార్టీ వెబ్‌సైట్ కు స్వాగతం

రాజ్యాంగంరాసిన అంబేద్కర్ ఆశయాలు, స్వాతంత్రం తెచ్చిన గాంధీ ఆలోచనలు మన తెలుగు రాష్ట్రాల్లో మొక్కదశకు కూడా రాలేదు.. అనాదిగా అధికార ఉన్మాదంతో మదమెక్కిన రాజకీయ ఉగ్రవాదుల గుప్పిట్లో నిలువెల్లా దోపిడీకి గురవుతుంది.. మన తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల పాలనలో దోపిడీలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా పెరిగాయి.. వనరులను వదలడం లేదు, రైతులను బతకనీయడం లేదు, మహిళలకు భద్రత లేదు, భవితకు భరోసా లేదు, పేదలకు బతుకు లేదు, ఆస్తికి హామీలేదు!
అందుకే ఆ ఆపత్కాల ఆపదల నుండి పుట్టిన ఆలోచనలు.. ఆలోచనల నుండి వచ్చిన ఆవిష్కరణలు.. ఆవిష్కరణల నుండి పడిన అడుగులు.. ఆ అడుగుల నుండి బీజం పోసుకుని ఆత్మగౌరవానికి, అభివృద్ధికి, అవినీతిపై పోరాటానికి, ప్రజా ఉద్యమానికి నినాదమై సామాన్యుడి గొంతుకగా మారినదే మన " భారత చైతన్య యువజన పార్టీ"! రెండు పార్టీల బాగోతాల బట్టలిప్పి.. వారి అసలు స్వరూపాన్ని ప్రజల ముందుంచి.. దోపిడీని కక్కించి, వ్యవస్థలను రక్షించి, రాజకీయ, కులాహంకార ముష్కరులను తరిమికొట్టి.. సామాన్యుడి చేతిలో అధికారం పెట్టే స్వచ్ఛమైన సుపరిపాలనకు వేదిక ఇది..
మన తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయ రాజకీయ ముష్కర మూకలకు సరైన సమాధానం చెప్పే మూడో ప్రత్యామ్నాయం మన భారత చైతన్య యువజన పార్టీ..
మన పార్టీలో సామాన్యులే పాలకులు, ప్రజలే భాగస్వాములు, యువకులే సంస్కర్తలు, రైతులే నిర్మాతలు, మహిళలే నిర్ణేతలు.

“శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు.”

“పార్టీ వ్యవస్థాపకులు,”
“జాతీయ అధ్యక్షులు.”
Bharatha Chaitanya Yuvajana Party - Principles

భారత చైతన్య యువజన పార్టీ - సిధ్ధాంతాలు

భారత చైతన్య యువజన పార్టీ కుల, మత,జాతి, వర్గ, ప్రాంత బేధం లేకుండా ప్రజల పూర్తి స్థాయిలో అవసరమైన, రాష్ట్రాభివృద్ధికి కావలసిన మౌళిక అవసరాలను దృష్టి లో ఉంచుకొని అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ప్రజలందరికీ సహాయపడే విధంగా కొన్ని పార్టీ సిధ్ధాంతాలు రూపొందించింది. వీటిని ప్రజలందరూ పరిశీలించి మీ అభిప్రాయాలను మాదృషికి తీసుకువచ్చి మరింత మెరుగైన పథకాలుగా తీర్చి మీకు సేవనందించే ప్రయత్నాన్ని సఫలీకృతం చేయుదురని కోరుకుంటున్నాము.

బడుగు జీవుల బాగు

Welfare of The poor
& Weeker Community

అన్నదాతల భరోసా

Assurance to Farmers
& Farmer Community

యువతకు భవిత

Career & Future
for Youth

అరాచక పాలనపై
పోరు

The fight against
Anarchic ruling